Saturday, July 13, 2024

కుజదోష నివారణకు అంగారక సంకష్ట చతుర్థీ వ్రతం!

ఆది దంపతుల కుమారుడు… సకల విఘ్నాలకు అధిపతి అయిన వినా యకుడుని పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. ఎలాంటి అడ్డంకులనైనా తొలగించే ఆది దేవుడి అనుగ్రహం పొందడా నికి, ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు సం కటహర చతుర్థి అత్యంత విశిష్టమైన రోజు. సంకష్టహర చతుర్థీ వ్రతాన్ని ఆచరించడం కష్టనివారణం. అభీష్టదాయకం.
కృష్ణ పక్ష చతుర్థిని సంకష్ట హర చతుర్థి అంటారు. సంకట హర చతుర్థి మంగళవా రం నాడు వస్తే అంగారక సంకష్ట చతుర్థి అం టారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన ది. ఆ రోజు అత్యంత పర్వదినం. ఈ అంగారక చవితి రోజున గణప తిని పూజించడం, సంకటహర చతుర్థీ వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతోపాటుగా చేపట్టిన పనులలో సంకటములన్నీ తొలగిపోతాయని ప్రతీతి. వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్య మైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సా యంత్రం సంకట గణష పూజ చేసి, చంద్రదర్శనం అనంతరం ఉప వాస దీక్షను విరమిస్తూ ఏదన్నా తింటారు.
సంకట చతుర్ధి ప్రాముఖ్యత భవిష్య పురాణంలోనూ నరసిం హ పురాణంలోనూ చెప్పబడింది. సంకట చతుర్థి మహత్యం శ్రీకృ ష్ణుడు యుధిష్టరునికి వివరించాడు. సంకట అంటే కష్టములు, ఇబ్బందులు, సమస్యలను హర అంటే హరించేది అని అర్థం. ఋ గ్వేదంలో గణపతి వేదాలు, జ్ఞానములకు, కర్మిష్టులకు, సర్వవ్యా పక భక్తుల ప్రభువని సర్వగణాలకు అధిదేవతని, సర్వాహ్లాదకరు డని, సర్వులకు జ్యేష్టుడని, అధినాయకుడని, ఉత్తమ కీర్తి సంపన్ను డని కీర్తించబడ్డాడు. గణపత్యథర్వ శీర్ణోపనిషత్తులో గణపతి సర్వ వ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపమని సృష్టి స్థితి లయములకు కార కుడని, సర్వ కార్యములకు సృష్టికి కర్త హర్త అని ఆనందమయుడని చిన్మయుడని, లంబోదరుదని, శూర్పకర్ణుడు, రక్తంగుడిగా అభివ ర్ణించారు. అటువంటి గణపతి సంకటాలను దూరం చేసేవాడని సం కట హరుడుగా పూజించడం అనాదిగా వస్తున్నదే. సంకటహరుని పూజించడానికి కృష్ణ పక్ష చతుర్థి ప్రసిద్ధి.
సంకటహర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు, ధర్మరాజుకు వివరిం చినట్లు పురాణ కథనం. భవిష్య, నరసింహ పురాణాల ప్రకారం, ఒకసారి ఇంద్రుడు, గణశ ఉపాసకుడైన భృషుండి అనే మహాముని ఆశ్రమం నుండి, విమానంపై ఇంద్ర లోకానికి తిరిగి వెళుతూ, శూర సేన మహారాజు రాజ్యం మీదుగా వెళ్ళే సమయాన మహా పాపాత్ము డొకడు, విమానాన్ని చూసినంతనే విమానం నేలపై దిగిపోతుంది. తేజో విరాజితమైన విమానాన్ని శూరసేనుడు చూడబోయి, ఇంద్రు డిదని తెలుసుకుని, ఆగిపోవడానికి కారణమడిగి ఇంద్రుని ద్వారా విని, మళ్ళీ లేచే ఉపాయం ఏదని అడుగుతాడు. ఆనాడు బ#హుళ పంచమి ఐనందున, గత దినం చతుర్థినాడు ఉపవసించిన భక్తులు ఉపవాస ఫలాన్ని దారబోస్తేనే, విమానం మళ్ళీ లేవగలదని ఇంద్రు డు వివరిస్తాడు. శూరసేనుని ఆజ్ఞానువర్తులైన సైనికులు రాజ్యమం తా వడబోసినా అట్టి భక్తులు దొరకని స్థితిలో నిరాశకు లోనుకాగా, ఆ సమయంలోనే మృతి చెందిన ఒక స్త్రీని గణపతి దూత తీసు కెళుతుండడం చూసి ఇదేమిటని సైనికులు అడుగుతారు. ఆమె గత దినం నిద్రలో ఉపవాసంతో ఉండి, రాత్రి చాలాసేపైనాక మెలకువ వచ్చి భోజనం చేసిందని, తెల్లవారి మృతి చెందినదని, జీవితంలో ఒకసారైనా సంకటహర చతుర్థి ఆచరిస్తే గణపతి లోక ప్రాప్తి లభిం చగలదని చెప్పారు. ఆమె శరీరాన్ని తమకు ఇవ్వాలని సైనికులు కోర గా, గణపతి దూత నిరాకరిస్తాడు. అదే సమయంలో ఆమె శరీరం నుండి వీచిన పెనుగాలి ఇంద్రుని విమానాన్ని స్పృశించిన వెంటనే అది పైకి లేస్తుంది.

అంగారక చతుర్థి ప్రత్యేకత

అయితే కష్ణపక్ష చవితి తిథి మంగళవారం తో కూడి వస్తే అంగారక చతుర్థి. ఈరోజు వినా యకుని వ్రత ఆచరణం అత్యంత ఫలప్రదం. వినాయకుని అనుగ్ర#హ ప్రాప్తికై, కుజుడు చేసిన తపస్సు ఫలితంగా, మాఘ కృష్ణ చతుర్థి దినా న చంద్రోదయ వేళలో పది భుజాలు కలిగిన బాలుని రూపంలో ప్రత్యక్షమై ఆ నాడు మం గళవారం కనుక కుజుని పేరు మంగళుడని నా మకరణం చేసి, అంగారక సంకష్ట చతుర్థి నాడు వినాయక వ్రతాచరణ ద్వారా కుజ దోష సమస్య లు, సంకటాలు తొలగి సఫలత లభించగలదని వరం ప్రసాదించారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.
సంకట#హర చతుర్థి రోజు దినమంతా ఉపవాస ముండి, సా యంత్రం సూర్యాస్తమయ సమయానికి అంటే సుమారు ఆరగం టలకు వినాయకుడి పటానికి, విగ్రహానికి గరికతో చేసిన దండవేసి, అష్టోత్తర నామాలతో పూజచేసి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టాలి. సం కటహర నాశన స్తోత్రం పఠించాలి. ఉపవాసం ఉండలేనివారు నాలుగుసార్లు సంకటహర నాశన స్తోత్రం పఠిస్తే గణపతి అనుగ్ర హాన్ని పొందవచ్చని పురాణ వచనం. చంద్రదర్శనానంతరం భోజ నాలు చేయడం, నిర్దేశిత ఆచారం. ఇలాచేస్తే సకల కష్టాలు, సంకటా లు తొలగిపోయి, సంకట నాశకుడైన విఘ్న నాయకుని కృపకు పాత్రులవుతారు. జన్మరా#హత్యం. మోక్షం సిద్ధించి, సప్త జన్మలు అవసరం లేకనే శాశ్వత గణశ ప్రాప్తి కలుగనున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి. తలపెట్టిన పనులకు విఘ్నాలు కలుగుతూ అశాంతి, మానసిక, శారీరక రుగ్మతలు, రుణ బాధలు, అనేక కష్టా లు కలుగుతున్నప్పుడు దుష్టగ్ర#హ పీడన నివారణ కొరకై ప్రతి నెలా సంకష్ట#హర చవితి నాడు యథాశక్తి విఘ్నేశ్వరుని పూజలు జరపడం సం ప్రదాయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement