Friday, April 26, 2024

7 నుండి శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నం

తిరుమల : రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి క‌లిపి రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుక‌బ‌డిన వ‌ర్గాల భ‌క్తుల‌కు అక్టోబ‌రు 7 నుండి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నం చేయించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. వీరికి తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నంతోపాటు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేయించ‌డం జ‌రుగుతుంది.

హిందూ ధ‌ర్మాన్ని ప్ర‌చారం చేసేందుకు, మ‌త మార్పిడుల‌ను అరిక‌ట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ‌తో క‌లిసి స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో టిటిడి మొద‌టి విడ‌త‌లో రూ.25 కోట్ల‌తో 13 జిల్లాల్లో 502 ఆల‌యాల‌ను నిర్మించిన విష‌యం తెలిసిందే. ఈ ఆల‌యాలు నిర్మించిన వెనుక‌బ‌డిన‌ ప్రాంతాల నుండి బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో భ‌క్తుల‌ను ఆహ్వానించి శ్రీ‌వారి ద‌ర్శనం చేయించ‌డం జ‌రుగుతుంది. ఒక్కో జిల్లా నుండి 10 బ‌స్సులు ఏర్పాటుచేసి భ‌క్తుల‌ను ఉచితంగా తిరుమ‌ల‌కు తీసుకురావ‌డం జ‌రుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement