Monday, June 17, 2024

శ్రీ ప్లవనామ సంవత్సర మేష రాశి ఫలాలు

మేష రాశి
ఆదాయం-08, వ్యయం-14
రాజ పూజ్యం-04, అవమానం-03

ఈ సంవత్సరంగురుడు ఉగాది 13.4.2021 నుండి 14.9.2021 వరకు మరల 20.11.2021 వత్సరాంతం వరకు కుంభరాశిలో, 11వ స్థానమై శుభుడైనందున అన్ని కార్యము లందు విజయాన్ని సాధిస్తారు. శత్రుబాధలుండవు. శుభవా ర్తలు వింటారు. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలు గుతారు. కుటు-ంబంలో అభివృద్ధితో పాటు- ఆకస్మికధన లాభముం టు-ంది.ఉద్యోగాదులలోవృద్ధి. 15.9.2021 నుండి 19.11.2021 వరకు మకరరాశిలో 10వ స్థాన మై సాధారణ శుభుడైనందున కుటు-ంబ పరిస్థితులు సంతృప్తి కరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటు-ంది. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.

ఈ సం|| శని ఉగాది 13.4.2021 నుండి 12.4.2021 వరకు మకరరాశిలో 10వ స్థానమై సాధారణ శుభుడైనందున ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. రాజకీయ, సామా జిక, సేవా రంగముల వారికి ఆటంకములు, కోర్టు వ్యవహారములు అనుకూలించకపోవుట.

ఈ సం|| రాహువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృషభరాశిలో 2వ స్థానమై సాధారణ శుభుడైనందున ఆకస్మిక ధనలాభయోగముంటు-ంది. కుటు-ంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణ మేర్పడుతుంది.

ఈ సం|| కేతువు ఉగాది 13.4.2021 నుంచి వత్సరాంతం వరకు వృశ్చికరాశిలో 8వ స్థానమై అశుభుడైనందున అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది.

కావున గురు, శని, రాహు, కేతువులకు జప, దానములు, సుందరకాండ పారాయణ, రుద్రాభిషేకము, గురు, శని, మంగళ వారములలో వేంకటేశ్వర స్వామికి, ఆంజనేయస్వామికి పూజలు చేయుట మంచిది. అశ్వని వారు వైడూర్యమును, భరణి వారు వజ్రమును, కృత్తిక వారు కెంపును ధరించుట వలన కార్యసిద్ధి అగును.

– శ్రీ గుదిమెళ్ళయతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement