Wednesday, May 1, 2024

పూజ- పరమార్థాలు

పూజ పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ, మృత్యు వులను లేకుండా చేసేది. సంపూర్ణఫలా న్నిచ్చేది.
అర్చన: అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయ మైనది, దేవతలను సంతోషపెట్టేది.
జపం: అనేక జన్మలలో చేసిన పాపా న్ని పోగొట్టేది, పరదేవతను సాక్షా త్కరింప చేసేది.
స్తోత్రం: నెమ్మది నెమ్మదిగా మన స్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది.
ధ్యానం: ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది. ఇష్టదేవతను చింతింపచేసేది.
దీక్ష: దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది. సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది.
అభిషేక: అ#హంభావాన్ని పోగొట్టేది. భయాన్ని మథించేది. పవిత్రోదకాన్ని చల్లేది. ఆనందాదులను కల్గించేది.
మంత్రం: తత్త్వం పై మననం చేయడంవల్ల భయాల నుండి రక్షించేది.
ఆసనం: ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్త సిద్ధి ని, లేదా నవసిద్ధులను కల్గించేది.
తర్పణం: పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనం దాన్ని కల్గించేది.
గంధం: అంతంలేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపచేసేది.
పుష్పం: పుణ్యాన్ని వృద్ధిచేసేది, పాపాన్ని పోగొట్టేది.
ధూపం: చెడువాసనలవల్ల వచ్చే అనేక దోషాలను పోగొ ట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది.
దీపం: సుదీర్ఘమైన అజ్ఞానాన్ని పొగొట్టేది. అ#హంకారం లేకుం డా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.
నైవేద్యం: ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్థాలను, దేవతకు తృప్తినిచ్చే దానిని నివేదన చేయుటయే.
ఆచమనీయం: లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం.
ఆవాహనం: పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవా#హనం.
స్వాగతం దేవతను కుశల ప్రశ్నవేయుట.
పాద్యం: చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడి న ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.
మధుపర్కం: తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.
స్నానం: గంధం, కస్తూరి, అగరు మొవాటితో స్నానం.
వందనం: అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం. వక్ష స్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకు తాకించి చేసే వందనం సాష్టాంగం.
ఉద్వాసనం: దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచా రాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు.
– డా|| చదలవాడ హరిబాబు, 9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement