Saturday, May 11, 2024

ధర్మం – మర్మం : తులసీ వైభవం (ఆడియోతో…)

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఇంద్రాది దేవతలు చేత భగవతి అయిన తులసి నిరంతరం సేవించదగినది. ఆ విధంగా సేవించినచో చతుర్వర్గ ఫలమును ప్రసాదించును. స్వర్గలోకమున, మర్త్య లోకమున, పాతాళ లోకమున కూడా తులసి దుర్లభమైనది. తులసి యందు భక్తి కలవారికి ధర్మార్థ కామ మోక్షములు లభించునని పద్మపురాణం ఉత్తరకాండం, ఉత్తరార్ధంలో క్రియాయోగ సారకాండంలో తులసి వైభవంలో వివరించబడినది.

ప్రదీపం యస్తు సంధ్యాయాం శ్రావణ కార్తీకే తధా
స్థాపయేత్‌ తులసీ మూలే కులకోటి సమన్విత:
సయాతి మందిరం విష్ణో: నాత్ర కార్యా విచారణా

శ్రావణ, కార్తీక మాసములలో సంధ్యాసమయములో తులసి వృక్షమునకు దీపము అర్పించినచో కోటి కులములతో కలసి శ్రీ మహావిష్ణువు మందిరమున చేరెదరు. ఈ విషయమున ఆలోచించవలసిన పనిలేదు. అదేవిధంగా తులసి వృక్షమును గోవులు, గాడిదలు, శునకములు, మనుష్యులు మరియు శిశివుల నుండి రక్షించిన వారిని కేశవుడు రక్షించును. భక్తితో తులసిని నాటినచో బ్రతికినంత కాలము సకల భోగములను అనుభవించి అంతమున మోక్షమును పొందును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement