Saturday, May 18, 2024

గీతాసారం (ఆడియోతో…)


అధ్యాయం 9, శ్లోకం 8

ప్రకృతిం స్వామవష్టభ్య
విసృజామి పున: పున: |
భూతగ్రామమిమిం కృత్స్నమ్‌
అవశం ప్రకృతేర్వశాత్‌ ||

తాత్పర్యము : సమస్త విశ్వము నా అధీనమున కలదు. అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరల మరల సృష్టించబడుచు, నా సంకల్పము చేతనే ఆంత్యమున లయము నొందుచుండును.

భాష్యము : సృష్టి అవసరమైనపుడు భగవంతుని అవతారమైన మహా విష్ణువు యొక్క ఉచ్చ్వాస వలన అనేక విశ్వాలు సృష్టించబడతాయి. అంతేకాక ప్రతి విశ్వములోనూ భగవంతుడు
గర్భోదకశాయి విష్ణువుగా ప్రకటితమవుతాడు. ఇలా విశ్వము సృష్టింపబడిన పిమ్మట భగవంతుడు క్షీరోదకశాయి విష్టువుగా ప్రకటితమవుతాడు. అతడు ప్రతి అణువు నందు కూడా పరమాత్మగా ప్రవేశిస్తాడు. సృష్టి, సృష్టింప బడినంతనే జీవరాశులు తమ తమ కోరికలను అనుసరించి కార్యములను మొదలు పెట్టును. అంతేకాని ఒక జీవరాశి తరువాత ఒకటిగా కాక అన్ని జీవరాశులు ఏక కాలముననే సృష్టింపబడినవి. వారి వారి పూర్వ కర్మల ననుసరించి వేరు వేరు స్థితిగలు ఇవ్వబడతాయి. ‘అవశము’అనే పద ప్రయోగము ద్వారా ఈ సృష్టి మొదలగుటకు జీవరాశి చేసేది ఏమి లేదని అంతా భగవంతుని ఇచ్చానుసారము, ఆయన దివ్యశక్తులచే జరుపబడుతుందని అర్ధము అవుతుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement