Friday, May 17, 2024

అన్నమయ్య కీర్తనలు : అన్ని విభవముల

రాగం : రీతి గౌళ
అన్ని విభవముల అతడితడు
కన్నులు వేవేలు గల ఘనుడితడు || ||అన్ని విభవముల ||

వేదాంత కోట్ల విభుడితడు
నాదబ్రహ్మపు నడుమితడు
ఆది నంత్యములకు అరుదితడు
శ్రీ దేవుడు సరసిజ నాభుడితడు || ||అన్ని విభవముల ||

భవములణచు యదుపతి ఇతడు
భవనములిన్నిటికి పొడవితడు
దివికి దివమైన తిరమితడు
పవనసుతు నేలిన పతి ఇతడు || ||అన్ని విభవముల ||

గరుడని మీదటి ఘనుడితడు
సిరులిందరికి నిచ్చే చెలువితడు
తిరువేంకటనగము దేవుడితడు
పరమపదమునకు ప్రభువితడు || ||అన్ని విభవముల ||

Advertisement

తాజా వార్తలు

Advertisement