Saturday, July 27, 2024

నారసింహుని శాంతింపజేసినశ్రీ శరభేశ్వర స్వామి!

యథా జలే జలం, క్రీస్తం, శ్రీరం, క్షీర కృతాంగ్‌
కృతే యేకయేవ తథా విష్ణు: శివ లీతో నాదాన్యత||

”అసురుడిని సంహరించడానికి, నరసింహుడు వచ్చాడు, నరసింహ భగవంతుడిని శాంతింప జేయడానికి, నేను శరటేశ్వరుడిగా వచ్చాను. నీరు- నీ రు, పాలు-పాలు, నెయ్యి- నెయ్యి, విడ దీయరానివి. ఒకేలా పూజించబడేలా ఇద్దరం ఒకటి” అని శివుడు దేవతలంద రికీ చెప్పాడు.
శివగ్రంథాలు, పురాణాల ప్రకా రం, విష్ణువు భయంకరమైన అవతార మైన నరసిం#హ భగవానుని శాంతింప జేయడానికి శివుడు శరభ రూపాన్ని ధ రించాడు. (శరభ అనేది డేగ, సింహం, మనిషి కలయిక అయిన శివుని అవతా రం.) హరణ్యకశిపుడి కడుపును చీల్చి ప్రేగులను వేసుకొని, రక్తాన్ని త్రాగి సం హరించిన ఉగ్ర నరసిం#హు డు అసుర లక్షణాలతో మరింత ఆగ్రహావేశాలు జ్వాలల్లా పెరిగి, అదే పనిగా ఆకాశమే దద్దరిల్లే విధంగా, విశ్వమే భయంతో వణికిపోయేలా, అరణ్యములో వేగంగా తిరుగాడుతుంటే భూమి యావత్తు కంపిం చిపోతుంటే, అహోబిలానికి విచ్చేసిన ముక్కోటి దేవతలు భయభ్రాంతులకులోనై భీతిల్లి పోతూ, అనేక విధాలుగా నారసిం#హుని శాంతించమని వేడుకోసాగినా, మరింత ఉగ్రావేశంతో అడుగులు వేస్తుంటే, అడవిలో జ్వా లలు పెరగసాగాయి.
సర్వదేవతలు భయబ్రాంతులకు లోనై పరమశివుణ్ణి వేడుకొనగా, వీర భద్రున్ని పంపి, విష్ణువు ఆగ్రహాన్ని లొంగదీయమని తెలిపి పంపించ గా, తన తీక్షణమైన చూపులతోనే అతిలోక భయంకరుడైన వీరభ ద్రుణ్ణి అదృశ్యం చేయడంతో, ఇక పరమశివుడే అత్యంత భీ కర శక్తివంతమైన రూపంతో సగం మా నవుడిగా, సగం మృ గంగా, మరో సగంగా పక్షి రూ పంలో అతిపెద్ద పరిమాణం లో, ఒళ్ళంతా పొక్కులతో, అనేక చేతులతో, పటిష్టమైన పం జాలతో, నిప్పు కణికల్లో మండుతూ వున్న మూడు కన్నులతో, అతిపెద్ద శిరోజాల తో, పెద్దదైనతో కతో, అతిపెద్ద రెక్కలతో, పొడవైన సూదిగా వుండేలా దంతాలతో, భ రించలేని బుసలు కొడుతూ, వినలేని ఉరుము ల్లాంటి గొంతుతో ప్రతిధ్వను లు చేస్తూ, నరసింహునికి శక్తికి మించిన ఆకారంతోనూ పరమశివుడే వైశాఖ శుద్ధ పౌర్ణమి నాటి సాయంత్రం వేళల్లో ”శ్రీ శరభేశ్వర అవతా రాన్ని ధరించి నారసింహుని ఎదుట ప్రత్యక్షమై, నరసిం హునితో హూరాహూరీగా తలపడగా, పరమేశ్వరుడు ఇక నరసింహుని అవతార సమాప్తి చేయాలని తన పొడవాటి తోకతో నారసింహుని చుట్టి పైకెత్తి గిరగిరా తిప్పి పడబోయే సమ యంలో, వచ్చినది పరమేశ్వరుడే అని నారసింహుడు తలచి.. ”ఓ శరభేశ్వరా! శరభ శరభ” అని పిలుస్తూ, నా ఉగ్రరూపాన్ని విరమి స్తున్నాను అని తెలిపాడు. పరమేశ్వరుని వైశాఖ శుద్ధ చతుర్దశితో జన్మించి (సరిగ్గా ఇరవై నాలుగు గంటలు మాత్రమే) వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజుతో అవతార సమాప్తి కాగా, పరమేశ్వరుడు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున శరభేశ్వరునిగా అవ తరించి లోక కళ్యాణం గావిస్తాడు. అనం తరం, శ్రీ నరసిం#హుడు నిజరూపమైన శ్రీ మహావిష్ణువు రూపాన్ని స్వీకరించి, శ్రీల క్ష్మీసమేతుడై వైకుంఠానికి ప్రయాణం కా గా, ప్రదోష సమయంలోనే శరభేశ్వరు డు అవతరించిన పౌర్ణమి అత్యంత పవి త్రమైన పుణ్యపర్వదినంగా ఆరాధించు కోవాలని శివపురాణం వివరించింది.
తమిళనాట ప్రచారములో నున్న కథ ప్రకారం… హరణ్యకశిపుడిని చంపి, ప్రహ్లాదుణ్ణి రక్షించటానికి మహా విష్ణువు నరసింహావతారం ఎత్తినట్లు మనందరి కీ తెలిసిన విషయమే. హరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత మన కథల ప్రకారం నరసిం#హుడి ఉగ్రరూపాన్ని మహాలక్ష్మి శాంతింప చేస్తుంది. కానీ హరణ్యకశిపుడి రక్తం నరసింహస్వామి శరీరంమీద, లోపల వుండి ఆయనని చా లా రౌద్రంగా చేసిందిట. హరణ్యకశిపుడి రక్తం నేల మీద పడితే అనే క మంది హరణ్యకశిపులు జన్మిస్తారుట. దానితో వాళ్ళు భయపడ్డా రు. దానిని ఆపటానికి ఆయనని చల్లబరచటానికి దేవతలు శివుణ్ణి ప్రార్ధించారుట. శివుడు వింత రూపాన్ని ధరించా డు. సింహ ము ఖం, మానవ శరీరం, పక్షి రెక్కలు, 8 కాళ్ళు, 4 చేతులతో ఆయన రూపం ప్రత్యక్షమయింది. ఆయన రెండు రెక్కలలో ఒక రెక్క ‘ప్రత్యంగరాదేవి’, రెండవది ‘శూలినిదుర్గ’ అవతరించారు. ఆయ న నరసింహుణ్ణి ఆకాశంలో భూమ్యాకర్షణ శక్తి పని చేయనంత ఎత్తుకు తీసుకెళ్ళాడు. ఆ ప్రదేశంలో శరభేశ్వరుడు నరసిం హుడి శరీరాన్ని నొక్కి చెడ్డ రక్తమంతా బయటకి పోయేటట్లు చేశాడు. భూ మ్యాకర్షణ శక్తి లేక పోవటంతో ఆ రక్తం కింద పడలేదు. శరీరం లోంచి చెడు రక్తం పోగానే నరసిం#హుడు శాంతించి శివుణ్ణి పూజిం చాడుట. శరభెశ్వురుణ్ణి పూజిస్తే నలుగురు దేవతలని పూజించిన ట్లే. శరభేశ్వరుని ఆకారంలో నలుగురు దేవతా మూర్తులు, శివుడు, కాళి, దుర్గ, విష్ణు వున్నారు. శరభేశ్వరస్వామిని పూజించటంవల్ల ఆరోగ్యం, మనసు చికాకులు, గ్రహదోషాలు తొలగిపోతాయి.
శివకేశవుల పురాణాలలోనే కాదు, బుద్ధుని జాతక కథలలో కూడా ఈ శరభ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ జాతక కథల ప్రకారం శరభ బుద్ధుని పూర్వ అవతారాలలో ఒకటి? శరభరూపం దక్షిణా దిన, అందునా తమిళనాట ఉన్న శివాలయాలలో ఎక్కువగా కని పిస్తుంది. ముఖ్యంగా శైవమతాన్ని ప్రోత్సహంచిన చోళులు నిర్మిం చిన ఆలయాలలో ఈ ప్రతిమ తప్పక ఉంటుంది. ఒకోచోట ఈ శర భ రూపం కేవలం నామ మాత్రంగానే ఉంటే, మరికొన్నిచోట్ల సకల ఆయుధాలతోనూ, దుర్గాదేవి సమేతంగా దర్శనమిస్తుంది. శివుని శరభేశ్వర మూర్తిగా కొలుచుకునే సంప్రదాయం ఉంది. ఇక తెలు గు రాష్ట్రాల్లోని శైవాలయాలలో కూడా ఈ శరభేశ్వర రూపం కనిపి స్తున్నది. ఈ అవతారం పేరు మీదుగా శరభాపురం వంటి ప్రాం తాలు మన రాష్ట్రాల్లో ఉన్నాయి. వీరశైవులు చేసే నృత్యాలలో శర భ, అశ్శరభ, దశ్శరభ అంటూ ఒళ్లు గగుర్పొడిచే అరుపులు వినిపి స్తాయి. తెలుగునాట శరభ ఉపనిషత్తు కూడా ఉందని చెబుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement