Friday, April 26, 2024

అల్లుఅర్జున్ తో బోయపాటి ఫిక్స్…అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లుఅర్జున్ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ ఎప్పటినుంచో నడుస్తోంది.

గతంలో బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కాంబినేషన్ సరైనోడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అందరిలోనూ ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతుందట. ఆల్రెడీ బోయపాటి శ్రీను అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement