Saturday, April 27, 2024

పేద ప్రజలకు సాయం చేయాలన్న ఆలోచనతో “SeVVA” సంస్థను ప్రారంభించిన విరుష్క

ఇండియన్ క్రికెట్ టీమ్ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మ ‘సేవా’ (SeVVA) అనే సంస్థను ప్రారంభించారు. ఈ జంట ‘సేవా’ ద్వారా పేద ప్రజలకు సహాయం చేయాలని చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ వివిధ సంస్థల ద్వారా ప్రజలకు సహాయం చేసేవారు. అయితే విరాట్ కోహ్లి, అనుష్క.. తమ తమ నాన్-ప్రాఫిటబుల్ సంస్థలను విలీనం చేసుకున్నారు. ఈ కొత్త సంస్థకు SeVVA అని పేరు పెట్టారు.

‘SeVVA’ను సగర్వంగా మీ ముందుకు తెస్తున్నాం. ఇది మా ఇద్దరి కలయికతో వస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ఇది. Se అంటే సెల్ఫ్, V అంటే విరాట్, V. అంటే వామిక, A అంటే అనుష్క, కుటుంబంగా కలిసి సమాజానికి వీలైనంత సేవ, సాయం అందించడంతో ఈ SeVVA లక్ష్యం అంటూ అనుష్క శర్మ ప్రకటించింది. అనుష్క శర్మ సోషల్ మీడియా పోస్టు ద్వారా ‘SeVVA’ సంస్థ వీడియోను పోస్ట్ చేసింది..

- Advertisement -

“సేవా ద్వారా భవిష్యత్తులో పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వడంతో పాటు టాలెంట్ ఉన్న వారిని గుర్తించి వాళ్లు క్రీడల్లో రాణించేందుకు అవసరమైన సహాయాన్ని, సదుపాయాలను కల్పించాలని అనుకుంటున్నాం. దీనికి మీ అందరి తోడ్పాటు కావాలి’ అంటూ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. అనుష్క శర్మ తన కూతురు పుట్టిన తర్వాత సినిమాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. ఆమె తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. కుమార్తె వామికతో ఎక్కువ సమయం గడుపుతోంది. అయితే, ఆమె భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందించబడిన చడ్డా ఎక్స్ ప్రెస్లో నటించనుంది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత విరాట్ కోహ్లి ఐపీఎల్లో కనిపించనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement