Saturday, July 27, 2024

సంక్రాంతి బరిలో విక్ర‌మ్.. రిలీజ్ కి రెడీ అవుతున్న ‘తంగలాన్’

ఏపీ, తెల‌గాన రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ‌ని ప్రజలు ఘనంగా జ‌రుపుకంటారు. ఈ పండగకు అంతా సొంతూళ్లకు చేరుకుని మూడు రోజుల పాటు అంగరంగం వైభవంగా వేడుక చేసుకుంటారు. ఇక సంక్రాంతి సీజన్ అంటే చాలు టాలీవుడ్ లో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తాయి. ఇప్ప‌టికే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని మహేష్ బాబు ‘గుంటూరుకారం’, వెంకటేష్ ‘సైంధవ్’, రవితేజ ‘ఈగల్’, ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సహా పలు సినిమాలు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

కాగా, తాజా సమాచారం ప్రకారం రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ‘తంగలాన్’ మూవీ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించకపోయినా, ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో విక్రమ్ సరికొత్త గెటప్ లో ‘తంగలాన్’ అనే ఆదివాసి తెగకు చెందిన వ్యక్తిగా నటిస్తున్నారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో పీరియాడికల్ జానర్ లో ఈ మూవీ రూపొందుతోంది. పాన్ ఇండియా సినిమాగా పారంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘తంగలాన్’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇందులో మాళవిక వారియర్ రోల్‌లో కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement