Tuesday, April 30, 2024

కాంబినేషన్ ఫిక్స్ ?… అధికారిక ప్రకటనే తరువాయి!!

కెజిఎఫ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కెజిఎఫ్ సినిమాకు సీక్వెల్ కెజిఎఫ్ చాప్టర్ 2 ను తెరకెక్కిస్తున్నారు. దీనితో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా కూడా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాల తరువాత కూడా అదే స్థాయిలో సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా తరువాత విజయ్ దళపతి తో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కాగా ఈ సినిమా దాదాపుగా ఫిక్స్ అయిందట.

ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ లెవెల్ లోనే తెరకెక్కనుందట. వాస్తవానికి విజయ్ దళపతి ఎలాంటి పాన్ ఇండియన్ సినిమా చెయ్యకుండానే 250 కోట్లకు పైగా మార్కెట్ ఉంది. అలాంటిది ప్రశాంత్ నీల్ లాంటి క్రేజీ డైరెక్టర్ తో సినిమా అంటే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మొత్తంగా ఈ సినిమాకు సంబంధించి ఒక్క అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement