Monday, April 29, 2024

టెర్ర‌రిస్టులపై విరుచుక‌ప‌డ్డ వీర రాఘ‌వ.. బీస్ట్ తెలుగు ట్రైల‌ర్ విడుద‌ల‌..

‘తుపాకీ’ సినిమాతో తెలుగు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు త‌మిళ‌ న‌టుడు విజ‌య్. ఈయ‌న న‌టించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏక‌కాలంలో విడుద‌లై మంచి విజ‌యాల‌ను అందించాయి. విజ‌య్ న‌టించిన‌ లాస్ట్ మూవీ ‘మాస్ట‌ర్’ తెలుగులో 14కోట్ల క‌లెక్షన్ల‌ను సాధించి ట్రేడ్ పండితుల‌ను సైతం ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. ప్ర‌స్తుతం విజ‌య్‌ న‌టించిన ‘బీస్ట్’ షూటింగ్ పూర్తి చేసేకుని విడుద‌ల‌కు రెడీగా ఉంది. ‘డాక్ట‌ర్’ ఫేమ్‌ నెల్సన్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. స‌న్‌పిక్చ‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ అత్యంత భారీగా నిర్మించిన‌ ఈ సినిమా నుండి ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, పాట‌లు సినిమాపై భారీ హైప్‌ క్రియేట్ చేశాయి. ఇటీవ‌లే చిత్రం నుంచి విడుద‌లైన ట్రైల‌ర్ యూట్యూబ్‌లో 4కోట్ల వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించింది.

అయితే ఆ ట్రైల‌ర్ తెలుగులో విడుద‌ల కాలేదు.. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్‌లో ఉంది. ఉగ్ర‌వాదులు మాల్‌ను హైజాగ్ చేస్తే అందులో ఉన్న ప్ర‌జ‌లను సోల్జ‌ర్ వీర రాఘ‌వ (విజ‌య్) ఎలా కాపాడాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెర‌కెక్కిన‌ట్టు ట్రైల‌ర్ చూస్తే తెలుస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్13న ఐదు భాష‌ల్లో విడుద‌ల‌కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement