Saturday, July 27, 2024

Varalakshmi Sarathkumar | బాయ్ ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్.. త్వ‌ర‌లో పెళ్లి

విలక్షణ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తన చిరకాల మిత్రుడు, గ్యాలరీస్ట్‌ నికోలాయితో ఇవ్వాల‌ ముంబయిలో నిశ్చితార్థం చేసుకుంది. ఇరు ఫ్యామిలీలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో బయటకు రాగా అవి వైరల్‌గా మారాయి. వరలక్ష్మి ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు చూసిన అభిమానులు, నేటిజ‌న్లు.. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా,  ముంబయికి గ్యాలరిస్ట్ నికోలాయి సచ్‌దేవ్‌తో వరలక్ష్మి 14 ఏళ్లుగా పరిచయం ఉందట. ఇండస్ట్రీకి పెద్దగా సంబంధం లేని వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతుంది. కాగా, వరుడుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement