Sunday, May 5, 2024

Pawan Kalyan : అభిమానుల ఆక‌లి తీర్చిన ఉస్తాద్..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ”ఉస్తాద్ భగత్ సింగ్”. ‘గబ్బర్ సింగ్’ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పుడెప్పుడో అనౌన్స్ చేయబడిన ఈ మూవీ పవన్ ఇతర కమిట్మెంట్స్ వల్ల లేట్ అవుతూ వస్తోంది.

అయితే చాలా కాలంగా ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్.. ఇప్పుడు ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, బర్త్ డే పోస్టర్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా పవన్ కల్యాణ్ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా ‘భగత్‌ బ్లేజ్’ అంటూ ఓ సర్ప్రైజింగ్ వీడియోని సోషల్ మీడియాలో వదిలారు. హరీష్ శంకర్ మార్క్ వన్ లైనర్స్, పవర్ ఫుల్ యాక్షన్ కలబోసిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది.

- Advertisement -

చాలా రోజులుగా పవర్ స్టార్ సినిమాల అప్డేట్స్ లేక మాంచి ఆకలి మీదున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా వుంది. పోలీస్ గెటప్ లో పవన్ కల్యాణ్ చేతిలో కత్తులు బరిసెలు పట్టుకొని ఊచ కోత కోయడాన్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు. టీ గ్లాస్ ను పగలగొట్టి ‘నీ రేంజ్ ఇది’ అని ఓ రౌడీ వార్నింగ్ ఇవ్వగా.. “గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది” అంటూ పవన్ పగిలిన గాజు ముక్కతో ఫైట్ చేయడం ఫ్యాన్స్ తో విజిల్స్ వేయిస్తుంది. “కచ్ఛితంగా గుర్తు పెట్టుకో, గ్లాస్‌ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం” అంటూ చెప్పే డైలాగ్ గూస్ బంమ్స్ తెప్పిస్తుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అశుతోష్ రానా, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఇది తమిళ్ లో హిట్టయిన తేరి రీమేక్ అనే టాక్ ఉంది. దీనికి ప్రముఖ దర్శకుడు కె. దశరధ్ స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా. సి. చంద్రమోహన్ అడిషినల్ రైటర్ గా వర్క్ చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement