Monday, May 13, 2024

”Guntur Karam” రెండు రోజుల కలెక్షన్లు ఇవే !

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే, ఈ సినిమా ఓపెనింగ్ టాక్ నెగిటివ్ గా వచ్చినా.. కలెక్షన్ల వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్లను మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 127 కోట్ల రూపాయలు వసూలు చేసిందని తెలిపారు.

ఇక, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement