Tuesday, May 7, 2024

డాక్టర్ హ్యారీ కోనిగ్ కి కృతజ్ఞతలు.. మ‌హేశ్ బాబు

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు SSMB28 చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయ‌న ఫ్యాన్స్. ఈ సినిమా జనవరి 2024 జనవరి 13 న విడుదల కానుంది.కాగా మహేష్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తర్వాత ద‌ర్శ‌కుడు రాజమౌళితో మరొక సినిమాను మొదలు పెట్టబోతున్నారు. ఆ ప్రాజెక్టుపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఆ సినిమాను దర్శక ధీరుడు హాలీవుడ్ రేంజ్ లో భారీ బడ్జెట్లో తెరపైకి తీసుకువచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కథ పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే వర్క్ షాప్ మొదలుపెట్టే సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం 2024 సమ్మర్లో స్టార్ట్ అవ్వచ్చు అని తెలుస్తోంది. కాగా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు నేచురోపతి డాక్టర్ హ్యారీ కోనిగ్ కి కృతజ్ఞతలు తెలిపారు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు . తన సోషల్ మీడియా ఎకౌంట్ లో ఫోటో కూడా షేర్ చేశారు. జర్మనీలో ఉన్న ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ కోయినిగ్ ను పరిచయం చేస్తూ.. మహేష్ బాబు ఇలా వివరణ ఇచ్చారు ధన్యవాదాలు @drharrykoenig! నా ఆరోగ్యం మెరుగైన చేతుల్లో.. అంటూ అతని గురించి ఒక క్యాప్షన్ ఇచ్చారు. మహేష్ చాలా సంవత్సరాలుగా ఈ వైద్యుని సంరక్షణలో ఉన్నార‌ని అతని చికిత్సల నుండి ఎంతో ప్రయోజనం పొందాడని ఇది అర్ధమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement