Sunday, April 14, 2024

మ‌హేశ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టైటిల్ తో పాటు మాస్ స్ట్రైక్

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు..ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న చిత్రానికి టైటిల్ తో పాటు మాస్ స్ట్రైక్ పేరుతో ఓ వీడియోని రిలీజ్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఫస్ట్ గ్లింప్స్ తరహాలోనే ఓ థండర్‌ లాంటి వీడియోని రిలీజ్‌ చేయబోతున్నారు. ఇది యాక్షన్‌ సన్నివేశాలతో ఫ్యాన్స్ కి పండగ చేసుకునేలా ఉంటుందని సమాచారం. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా మరో కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. మహేష్‌ బ్యాక్‌ సైడ్‌ నుంచి ఉన్న కొత్త లుక్‌ ఇది. తలకు రెడ్‌ టవల్‌ కట్టుకుని, చేతితో సిగరేట్‌ తాగుతూ, చెక్స్ షర్ట్ లో, రగ్గుడ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో మహేష్‌ లుక్‌ ఊరమాస్‌గా ఉండటం విశేషం. ఇది ఫ్యాన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది.ఈ చిత్రంలో పూజా హెగ్డే మెయిన్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా, శ్రీలీల సెకండ్‌ హీరోయిన్‌గా చేస్తుంది. జాన్‌ అబ్రహం నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసినిమాకి సంబంధించి ఓ క్రేజీ పనిచేయబోతుంది యూనిట్‌. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా టైటిల్‌ని ఏకంగా ఫ్యాన్స్ చేతనే రివీల్‌ చేయించబోతుంది. థియేటర్లలోనే ఈ సినిమా టైటిల్‌ని రిలీజ్‌ చేయబోతున్నారు. అది ఫ్యాన్స్ తోనే చేయించాలని ప్లాన్‌ చేశారు. అయితే ఇది సూపర్‌ స్టార్‌ కృష్ణ ఎవర్‌ గ్రీన్‌ మూవీ మోసగాళ్లకి మోసగాడు మూవీ ప్రదర్శించే థియేటర్లలో కావడం విశేషం. కృష్ణ జయంతి సందర్భంగా మోసగాళ్లకి మోసగాడు చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్న విష‌యం తెలిసిందే. దాంతోపాటు ఎస్‌ఎస్‌ఎంబీ28 టైటిల్‌ని రిలీజ్‌ చేయనున్నారని చెప్పొచ్చు. ఓ రకంగా ఇది అరుదైన విషయమనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement