Sunday, October 6, 2024

Pathaan 2 కి షారుక్ ఖాన్ గ్రీన్ సిగ్న‌ల్… త్వ‌ర‌లోనే షూటింగ్‌

వరుస ఫ్లాపులతో డీలా పడిపోయిన షారుక్ ఖాన్‌కి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా పఠాన్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు కొల్లగొట్టిందో తెలిసిందే. తాజాగా పఠాన్ 2కి షారుక్ ఊ కొట్టినట్లు తెలుస్తోంది. 2023 జనవరిలో రిలీజైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సూనామీ సృషించింది. తాజాగా షారుక్ మరోసారి యశ్ రాజ్ ఫిలిమ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో RAW ఏజెంట్‌గా తెరపైకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పఠాన్ సీక్వెల్ ‘పఠాన్ 2’కి షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే నిర్మాత ఆదిత్య చోప్రా-షారుక్ ఖాన్ మధ్య దీనిపై చర్చలు కూడా ముగిశాయట. ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని బాలీవుడ్‌లో టాక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement