Wednesday, October 2, 2024

Sai Pallavi:అవునా.. ఇది నిజమా..య‌శ్ స‌ర‌స‌న సాయిప‌ల్లవి

కన్నడ స్టార్ యశ్ సరసన సాయిప‌ల్లవి చేయనున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం యశ్ 19వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ శుక్రవారం రోజున ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.

ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి కనిపించనుందని అంటున్నారు. ఆమె ఎంపిక జరిగిపోయిందనే ప్రచారం జోరుగానే ఉంది. అయితే అధికారిక ప్రకటన రావలసి ఉంది. తన పాత్రకి ప్రాధాన్యత ఉండాలి .. గుర్తింపు ఉండాలని బలంగా భావించే సాయిపల్లవి, ఈ సినిమా చేయడమనేది ఎంతవరకూ వాస్తవమనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement