Thursday, May 9, 2024

Taapsee:తాప్సీకి రివ‌ర్స్ పంచ్…

పక్కవాళ్ల జీవితాల గురించి వ్యంగ్యంగా మాట్లాడి, లేని ఇక్కట్లను కొని తెచ్చుకుంది తాప్సీ. ఆమె పెళ్లి గురించి గతంలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మాథిస్‌ బోతో ఆమె చాలారోజులుగా డేటింగ్‌లో ఉంది. కొన్నిరోజుల క్రితం ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో తాప్సీని చూసిన అభిమానులు పెళ్లి గురించి ప్రశ్నలు సంధించారు.

దానికి ‘ముందు గర్భం దాల్చనీయండి.. తర్వాత కదా పెళ్లీ..?!’ అంటూ వెటకారంగా స్పందించింది. ఈ వెటకారం వెనుక మర్మం లేకపోలేదు. అలియాభట్‌ పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఆ తర్వాతే వివాహం చేసుకుంది. నటి ఇలియానా కూడా సేమ్‌టుసేమ్‌. వారి వ్యక్తిగత జీవితాలపై పరోక్షంగా సైటైర్‌ వేస్తూ తాప్సీ ఇచ్చిన సమాధానమది. ఆ సమాధానమే ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది తాప్సీకి. తాప్పీ ఎక్క‌డ క‌నిపించినా .. ‘ఇంకా గర్భం దాల్చలేదా?..’ అని ఒకరు.. ‘ఇంతకీ గర్భం ఎప్పుడు దాలుస్తావ్‌?..’ అని మరొకడు ఇలా సెటైర్లమీద సెటైర్లు వేస్తున్య‌నారు… ఆమె జోక్‌ ఆమెకే రివర్స్‌ తగలడంతో పాపం తాప్సీ మౌనాన్ని ఆశ్రయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement