Friday, May 17, 2024

రవితేజ “ఈగిల్” లేటెస్ట్ అప్‌డేట్.. రేపే ఫస్ట్ సింగిల్ ప్రోమో

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘‘ఈగిల్’’. ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. ఇక, ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై మేకర్స్ తాజాగా ఒక అప్డేట్ ను రిలీజ్ చేశారు.

‘‘ఆడు మచ్చా’’ అనే ఫస్ట్ సింగిల్‌ పాటను డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పాటకి సంబందించిన ప్రోమోను రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యార్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్,కావ్య థాపర్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. దవ్ జంద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement