Friday, May 3, 2024

ప్రభాస్ తో ఒక్కరోజు డేటింగ్ చేస్తా….రష్మీక

ఛలో సినిమా తో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు హీరోయిన్ రష్మిక మందన్న. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు వచ్చాయి. గత ఏడాది… సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ హిట్ లను అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది రష్మిక.

ఇదిలాఉండగా రష్మిక డేటింగ్ కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. తాను ఒక తెలుగు స్టార్ హీరోతో డేటింగ్ కి వెళ్లాలని అనుకుంటున్నానని అది మరెవరో కాదని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ అమ్మడు తనకు అవకాశం వస్తే తప్పకుండా ఒక రోజు ప్రభాస్ తో డేట్ కి వెళ్తానని తెలిపింది. ఇక ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో మిషన్ మజ్ను సినిమా చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement