Monday, May 20, 2024

ఇన్ స్టా గ్రామ్ లో రామ్ చ‌ర‌ణ్ కి 10మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్.. పండ‌గ చేసుకుంటోన్న ఫ్యాన్స్

త‌న అభిమానుల అభిరుచుల‌కు అనుగుణంగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. కాగా సోషల్ మీడియాలో అరుదైన మైల్‌స్టోన్ చేరుకున్నాడు రామ్ చ‌ర‌ణ్. ఇన్‌స్టాగ్రామ్‌లో రాంచరణ్ ఫాలోవర్ల సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంది. ఈ మార్క్‌ను చేరుకున్న అతికొద్ది మంది యాక్టర్లలో రాంచరణ్‌ కూడా ఒకడు కావడం విశేషం.

రాంచరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఆర్‌సీ 15 సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఈ చిత్రంలో ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోండగా.. శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య, అంజలి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తు్న్నారు. న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుగుతోంది.అంతేకాదు ఉప్పెన డైరెక్టర్‌ బుచ్చిబాబు సానతో మరో సినిమా కూడా ప్రకటించి టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. ఆర్‌సీ 15లో రాంచరణ్‌ పవర్‌ ఫుల్ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement