Monday, October 7, 2024

Rakul: నేడే గోవాలో ర‌కుల్ వివాహం..

గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న బాలీవుడ్ స్టార్స్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని ఇవాళ సంసార జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్ప‌టికే గోవా వేదికగా ఇప్పటికే వీరి పెళ్లి వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. హల్దీ వేడుకతో ఈ సంబురాల‌కు శ్రీకారం చుట్టారు. సంగీత్తో ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సరదాగా గడిపారు. నచ్చిన డ్యాన్సులు, రకరకాల ఆటలతో ఎంజాయ్ చేశారు. రకుల్, జాకీ మెహందీ, సంగీత్ వేడుకలో పలువురు బాలీవుడ్ స్టార్స్ పాల్గొని సందడి చేశారు.

ఈ నూతన జంటకు దగ్గరి మిత్రుడు అయిన నటుడు వరుణ్ ధావన్ స్పెషల్ సాంగ్ కు డ్యాన్స్ చేసి అలరించాడు. ‘కూలీ నంబర్ 1’లోని హుస్న్ హై సుహానా అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి వారెవ్వా అనిపించాడు. వరుణ్తో పాటు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఇతర కుటుంబ సభ్యులు కూడా సంగీత్లో డ్యాన్సులు చేసి ఆకట్టుకున్నారు.

- Advertisement -

పెళ్లిలో కీలక వేడుకలో భాగంగా . ఇవాళ ఉదయం ‘చుద్దా’ అనే సంప్రదాయ కార్యక్రమం నిర్వ‌హించారు.. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత గ్రాండ్ సౌత్ గోవాలో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లి వేడుక ఆనంద్ కరాజ్, సింధీ-శైలిలో జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించిన రెండు సంప్రదాయాల ప్రకారం వివాహం జరగనుంది. ఈ వేడుకలో బంధువులు, కొద్ది మంది మిత్రులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖు పాల్గొననున్నారు. నూతన జంటను ఆశీర్వదించనున్నారు. పెళ్లి తర్వాత ఈ కొత్త జంట అతిథులందరికీ ప్రత్యేకంగా పార్టీ ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement