Friday, October 11, 2024

రాజ‌మౌళి మ‌రో పాన్ఇండియా సినిమా.. మహేష్‌కు జోడీ శ్రద్ధాకపూర్‌.!?

తెలుగు సినిమాను పాన్‌ ఇండియా సినిమాగా ఎదగడానికి పునాదులు వేసిన దర్శకుడు ఎస్‌ఎస్‌. రాజమౌళి. ఇటీవలే ఆయన రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రపంచవ్యాప్తంగా 11 వందల కోట్లు వసూలు చేసింది. ఓటీటీలో రిలీజ్‌ చేయగా నాన్‌ ఇంగ్లీష్ సినిమాల్లో అత్యధిక గంటలు వీక్షించిన చిత్రంగా నిలిచింది. ఇకపోతే రాజమౌళి తదుపరి చిత్రంపై మళ్లి సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈసారి ఆయన హీరో మహేష్‌బాబు. మాస్‌ ఫాలోయింగ్‌ అత్యధికంగా ఉన్న సూపర్‌స్టార్‌ మహేష్‌తో రాజమౌళి ఎలాంటి సినిమా తీయబోతున్నాడనే దానిపై చర్చ జరుగుతోంది. ఆఫ్రికాలో ఫారెస్ట్‌ నేపథ్యంలో తీస్తారని కూడా అంటున్నారు. ఇకపోతే మహేష్‌, రాజమౌళి సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతుంది.

బడ్జెట్‌ భారీగానే ఉండే అవకాశం ఉంది. రాజమౌళికి తదుపరి సినిమా ఇదే. మహేష్‌ మాత్రం త్రివిక్రమ్‌ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమాలో జాయిన్‌ అవుతారని భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ నాయికగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభాస్‌తో సాహోలో నటించిన ఈ అమ్మడు మహేష్‌ సినిమాలో కూడా నటించే ఛాన్స్‌ ఉంది. ప్రస్తుతానికి శ్రద్దాకపూర్‌ పేరు ప్రచారంలో ఉంది. దీనిపై చిత్ర బృందం నుండి స్పష్టత రావాల్సి ఉంది. ఇకపోతే రాజమౌళి, మహేష్‌ సినిమా పాన్‌ ఇండియా కాబట్టి కచ్చితంగా బాలీవుడ్‌ నటినే ఎంపికచేస్తారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement