ప్రియాంక చోప్రాకు ప్రస్తుతం ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా సినీ వర్గాల్లో ఆమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ప్రయాంక్. అయితే తాజగా తన చిన్ననాటి బాయ్ ఫ్రేండ్ గురించి ఓ సీక్రెట్ రివీల్ అయింది. ప్రియాంకకు పదో తరగతిలోనే ఓ లవ్ స్టోరీ ఉందట. ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘అన్ ఫినిష్డ్’లో ప్రస్తావించింది. తాను పదో తరగతిలోనే ప్రేమలో పడి ఓ వ్యక్తితో రొమాన్స్ చేసినట్లు పేర్కొంటూ ఆ సందర్భాన్ని వివరించింది.
పదో తరగతిలో బాబ్ అనే అబ్బాయి చలాకీతనం తనం చూసి పడిపోయా. ఫన్నీ చేష్టలతో ఎప్పుడూ నవ్వించే అతనితో ప్రేమలో పడిపోయా. అతడినే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా అని చెప్పిన ప్రియాంక.. ఓ రోజు ఇంట్లో తన బాయ్ ప్రెండ్‌తో రొమాన్స్ చేస్తూ దొరికిపోయాననే విషయాన్ని రివీల్ చేసింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో అతను మా ఇంటికి వచ్చాడని, ఇద్దరం కలిసి టీవీ చూస్తుండగా సడెన్‌గా మా ఆంటీ రావడంతో అతన్ని గదిలోనే దాచి పెట్టానని, కానీ అది మా ఆంటీ పసిగట్టి అమ్మకు చెప్పిందని ప్రియాంక తన పుస్తకంలో పేర్కొంది. దీంతో ప్రియాంక చెప్పిన ఈ మెమరబుల్ మూమెంట్ జనాల్లో చర్చనీయాంశం అయింది.
ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ తనకంటే పదేళ్లు చిన్నవాడైన హలీవుడ్ గాయకుడు నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్ళాడి అందరి దృష్టిలో పడింది. ఎవరేమనుకున్నా సరే అన్నట్లుగా అప్పటినుంచి పబ్లిక్ రొమాన్స్ చేస్తూ యమ కిక్కిస్తోంది. అయితే ప్రియాంకకు పదో తరగతిలోనే ఓ లవ్ స్టోరీ ఉందట. ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘అన్ ఫినిష్డ్’లో ప్రస్తావించింది. అందులో భాగంగానే తన చిన్నతనంలో చేసిన ఓ చిలిపి పనిని ఈ బుక్‌లో రాసుకొచ్చింది ప్రియాంక.
ఇది కూడా చదవండి: భారత జనాభా 300 కోట్లా..?