Tuesday, June 18, 2024

SSMB29 | షూటింగ్‌లో ప్రిన్స్ మహేష్.. జనాలకు దూరం దూరం

మహేష్ బాబు ఇటీవల ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతార్ లో కనిపించాడు. కాగా, మహేష్ బాబు తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి కోరుకున్న లుక్ ని సాధించేందుకు మహేష్ బాబు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం మేకోవర్ ప్రాసెస్ లో ఉన్న మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు పబ్లిక్ ఇంటరాక్షన్స్ కి దూరంగా ఉండనున్నట్టు తెలుస్తొంది.

మహేష్ బాబు త్వరలో ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబు ఏ యాడ్ షూట్ లోనూ, పబ్లిక్ లోనూ కనిపించడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement