Sunday, April 28, 2024

నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు ధరల మోత.. కొత్త చార్జీలు అమల్లోకి

నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ను ఒకరు తీసుకుంటే చాలు అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు తమ ఫోన్లలో నెట్‌ఫ్లిక్స్‌ యాప్‌ ద్వారా సినిమాలు, సిరీస్‌లు చూసే వెసులుబాటు ఉండేది. అయితే ఇకనుంచి ఒకరి ఖాతాను ఉపయోగించి మరొకరు చూడాలంటే యూజర్లు ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త ధరల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. ఈ విధానం అమలులోకి వస్తే యూజర్లు తమ అకౌంట్లను కుటుంబ సభ్యులు లేదా ఇతరులతో పంచుకుంటే ఎక్కువ ఛార్జీలు చెల్లించాలి.

కాగా కంపెనీ స్టాక్‌ త్రైమాసికపు ఫలితాల్లో పడిపోయింది. సబ్‌స్క్రైబర్ల పెరుగుదల తగ్గిపోయింది. అయితే మరోవైపు ఓటీటీ మార్కెట్‌ భారీగా పెరిగింది. ఈనేపథ్యంలో తమ యూజర్లను అకౌంట్‌ షేర్‌ చేస్తే ఛార్జీలను విధించాలని నెట్‌ఫ్లిక్స్‌ భావిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ ప్రస్తుతం చిలీ, కోస్టరికా, పెరులో సబ్‌అంకౌంట్లకు ఇద్దరు వ్యక్తులను యాడ్‌ చేసుకునే ఆప్షన్‌ కల్పించి నెలవారీ ఫీజుగా రెండు నుంచి మూడు డాలర్ల ఛార్జీలను వసూలు చేయనున్నట్లు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement