Monday, April 29, 2024

Pre Wedding – అమీర్ ఖాన్ ఇంట పెళ్లి సంద‌డి…ఇరా ఖాన్ ప్రీ వెడ్డింగ్ హంగామా..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ జిమ్ కోచ్ నూపుర్ శిఖారేని ప్రేమించి పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు ఇరువైపులా పెద్ద‌ల స‌మ‌క్షంలో ఈ జంట‌ నిశ్చితార్థం జ‌రిగింది. ఇరాఖాన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. 2024 జనవరి 3న ఈ వివాహం జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఇరా-నూపుర్ జంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఇరా ఖాన్ ఫోటోలు – వీడియోలు ఇన్ స్టాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ వేడుక‌ల్లో కాబోయే పెళ్లికూతురు ఇరా ఖాన్ ముగ్ధ మ‌నోహ‌ర రూపం ఆక‌ట్టుకుంది. పింక్ కలర్ లెహెరియా చీరలో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఇరా ముక్కు పుడ‌క సోయ‌గం అద్భుతం .. త‌న‌తో పాటు ఆడ‌ప‌డుచులు బంధువులు క‌లిసి ముక్కుపుడ‌క‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న ఫోటోలు ఆక‌ట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement