Saturday, July 27, 2024

సోషల్ మీడియాలో ప్రభాస్ న్యూ లుక్ రచ్చ రచ్చ !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. నెట్ ఫ్లిక్స్ సీఈవో, గ్లోబల్ హెడ్ టెడ్ సరండోస్ హైదరాబాద్ పర్యటనలో ఉండగా… టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ ప్రత్యేకంగా కలుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ ను కూడా కలిశారు. అయితే, ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ‘కల్కి’ షూటింగ్‌లో ఉన్నట్టు నెట్‌ఫ్లిక్స్ సీఈవో సరండోస్ పంచుకున్న ఫొటోతో తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఆ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ ప్రభాస్ ను ప్రత్యేకంగా కలవడం ఓ విషయమైతే.. తను పంచుకున్న ఫొటోతో ప్రభాస్ న్యూ లుక్ అభిమానులకు ట్రీట్ గా మారింది. డార్లింగ్ మాసీవ్ లుక్ అదిరిపోయింది. గడ్డం, మీసాలు, పొడవాటి జుట్టుతో ఆకట్టుకుంటున్నారు. కల్కి షూటింగ్ కు సంబంధించిన లుక్ గా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement