Saturday, April 13, 2024

Prabhas: ప్ర‌భాస్ క‌ల్కీ డ‌బ్బింగ్ షురూ…

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టాలీవుడ్ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898AD’. మరో రెండు నెలలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా.. శరవేగంగా పనులను పూర్తీ చేసుకుంటుంది. చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ ని ఫుల్ స్వింగ్ లో నడిస్తున్నట్లు సమాచారం.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. హాలీవుడ్ రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ని సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యిపోయాయట. ఈ మూవీలో నటిస్తున్న ఆర్టిస్ట్ అయాజ్ పాష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కల్కి డబ్బింగ్ వర్క్ చేస్తున్నట్లు ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ పిక్ తో కల్కి డబ్బింగ్ వర్క్స్ మొదలయ్యిపోయాయి అని తెలుస్తుంది. ఇక మార్చి నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేయనున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement