Thursday, May 2, 2024

‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ ఎప్పుడంటే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి ఇది రీమేక్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా నటిస్తోంది. యంగ్ హీరో రానా మరో ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఆయనకు జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.


ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిన వీడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. పవన్ పుట్టినరోజున ఉదయం 11:16 గంటలకు ఫస్టు సింగిల్ గా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీం ప్రకటించింది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement