Saturday, June 22, 2024

Nithin : వినోదం అందించే రాబిన్‌హుడ్

నితిన్‌ ‘రాబిన్‌హుడ్‌’ సినిమాను డిసెంబర్‌ 20న విడుదల చేయనున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించారు. వెంకీ కుడుముల దర్శకుడు. పాత్ర ప్రకారం నితిన్‌ గెటప్‌ కొత్తగా కనిపిస్తోంది. అతన్ని దొంగగా పరిచయం చేసిన టీజర్‌ హాస్యభరితంగా ఉండగా, బర్త్‌డే గ్లిమ్స్‌ యాక్షన్‌తో ఉంది.

‘రాబిన్‌హుడ్‌’ చిత్రంలో కమర్షియల్‌ అంశాలే కాకుండా తగినంత వినోదం కూడా ఉంటుందని చిత్ర బృందం అంటోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టరలో హీరో నితిన్‌ ముఖంలో ఇంటెన్సిటీ కలిగివుంది. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రానికి నిర్మాతలు. జీవీ. ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌ ఇతర ముఖ్యపాత్రధారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement