Sunday, April 28, 2024

భారీ ధరకు అమ్ముడైన నిఖిల్ పాన్ ఇండియన్ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్

ఇటీవల కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో వరుసగా రెండు సక్సెస్ లు సొంతం చేసుకుని కెరీర్ పరంగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు యువ నటుడు నిఖిల్. ఇక ప్రస్తుతం హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ స్పై. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియన్ మూవీతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చరణ్‌తేజ్ ఉప్పలపాటి సీఈవోగా ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ భారీ మూవీని వేసవిలో విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

కాగా, ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి హైప్ ని ఏర్పరిచాయి. ఇక తాజాగా, ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ ని అమెజాన్, స్టార్ నెట్‌వర్క్ సంస్టలు రూ.40 కోట్లకు దక్కించుకున్నాయి. కాగా ఇది నిఖిల్ కెరీర్ లో హైయెస్ట్ అని చెప్పాలి. ఇక ఇటీవల డిజిటల్, శాటిలైట్ హక్కుదారులు మూవీకి సంబంధించి కొన్ని రష్‌లను వీక్షించి ఎంతో ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆర్యన్ రాజేష్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. కాగా త్వరలో ఈ మూవీ గురించిన పూర్తి వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడి కానున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement