Monday, April 29, 2024

సోష‌ల్ మీడియా రీ ఎంట్రీ ఇచ్చ‌న నిహారిక కొణిదెల..

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె, న‌టి నిహారిక చాలా రోజులుగా సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. నిహారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేయ‌డంతో ర‌క‌ర‌కాల ఊహాగానాలు తెర‌పైకి వచ్చాయి. అయితే సుమారు 8 వారాల త‌ర్వాత మ‌ళ్లీ నెట్టింట అడుగుపెట్టింది నిహారిక‌. త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను రీయాక్టివేట్ చేసింది. కాగా.. సోష‌ల్ మీడియా నుంచి తీసుకున్న ఈ విరామ స‌మ‌యంలో 3 పాఠాలు నేర్చుకున్నానని చెప్పింది.

8 వారాల సుదీర్ఘ విరామ స‌మ‌యంలో 3 పాఠాలు నేర్చుకున్నా..అవి 1) ప్ర‌పంచం అంతం కాదు. 2) ఇత‌రులు ఏం చేస్తున్నారో..నేను నిజంగా ప‌ట్టించుకోలేదు. 3) నేను ఇపుడు పోస్ట్ చేయ‌డానికి రిఫ్రెష్‌గా, ఎక్జ‌యిటెడ్‌గా ఉన్నాను..అంటూ సైడ్‌ లుక్‌లో ఉన్న స్టిల్ ఒక‌టి ఇన్ స్టాలో పోస్ట్ చేసి.. త‌న ఎక్జ‌యిట్ మెంట్‌ను షేర్ చేసుకుంది నిహారిక‌. త‌న డైలీ యాక్టివిటీస్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుండే నిహారిక ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియా నుంచి త‌ప్పుకోవ‌డం టాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement