Tuesday, June 18, 2024

క‌డ‌ప ఎస్వీకాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ లో.. మీట‌ర్ మూవీ టీం

క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న చిత్రం మీట‌ర్.ఈ చిత్రంలో హీరోగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తున్నాడు. కాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో కిరణ్ అబ్బవరం టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. మీటర్‌ టీం ప్రస్తుతం కడపలోని ఎస్వీ కాలేజ్‌ ఆఫ్ ఇంజినీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌కు వెళ్లింది. హీరోహీరోయిన్లు కిరణ్‌ అబ్బవరం, అతుల్యరవిని చూసేందుకు పెద్ద సంఖ్యలో మూవీ లవర్స్, విద్యార్థులు కాలేజ్‌కు తరలివచ్చారు. కిరణ్‌అబ్బవరంతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇప్పుడీ స్టిల్స్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. మీటర్‌లో కోలీవుడ్ భామ అతుల్య రవి ఫీమేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఈ సినిమాతో రమేశ్‌ కడూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో క్లాప్ ఎంటర్‌ టైన్‌ మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement