Friday, May 17, 2024

సాహసవీరుడికి మెగాస్టార్ పుట్టినరోజు శుభాకాంక్షలు

సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సాహసానికి మారుపేరు మల్లె పువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే సార్ అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత వేదాళం, లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి నటించబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement