Thursday, March 28, 2024

మహేష్ బాబు #SSMB28 అప్‌డేట్.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో షూట్ జరుతుంది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో భారీ బజ్ ఉన్న ప్రాజెక్ట్‌లలో ఈ సినిమా ఒకటి. అతడు, ఖలేక వంటి కల్ట్ క్లాసిక్స్ సినిమాల తర్వాత, మహేష్- త్రివిక్రమ్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కోసం చేతులు కలిపారు. ఇందులో మంచి యాక్షన్ అంశాలు కూడా ఉంటాయట.

అయితే, సూపర్ స్టార్ అభిమానుల కోసం సూపర్ గుడ్ న్యూస్ చెప్పారు మూవీ మేకర్స్. ఈ సినిమా వచ్చే ఏడాది (2024) సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. 2024 జనవరి 13న వర్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుందని మహేష్ బాబు సిగార్ తాగుతున్న అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ బాణీలు సమకూరుస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement