Sunday, April 28, 2024

Teja Sajja: థియేటర్లలో పండగ చేసుకుందాం

ప్ర‌శాంత్‌ వర్మ, తేజ సజ కాంబినేషన్‌ చిత్రం ‘హను-మాన్‌’ సినిమా నుంచి మూడవ సింగిల్‌ ”ఆవకాయ ఆంజనేయ… ” పాట విడుదలైంది. సింహాచలం మన్నెల అందించిన సాహిత్యాన్ని, సాహితీ ఆలపించారు. తేజ సజ్జ ఈ పాటలో పవర్‌-ప్యాక్డ్‌ అవతార్లో కనిపించారు.

హీరో తేజా సజ్జ మాట్లాడుతూ.. మనకి ఆపద వస్తే ఆంజనేయ స్వామి, ఆకలేస్తే ఆవకాయ..ఇది మన కల్చర్‌ లో బలంగా పాతుకుపోయి వుంది. అద్భుతమైన ఆలోచనని అంతే అద్భుతంగా విజువలైజ్‌ చేసిన ప్రశాంత్‌ గారికి థాంక్స్‌. ఈ సంక్రాంతికి హనుమాన్‌ థియేటర్స్‌ లోకి రాబోతుంది. అందరూ థియేటర్‌ కి వచ్చి చూడండి. ఈ పండక్కి హనుమాన్‌ తో థియేటర్లో పండగ చేసుకుందాం” అన్నారు. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ.. ఆవకాయ ఆంజనేయ పాట చాలా ప్రత్యేకం. ఈ పాటతోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టాం. విడుదల చేస్తున్న ఒకొక్క ప్రమోషనల్‌ మెరటిరియల్‌ తో సినిమాలో ఏముంటు-ందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ద్వారా సినిమాలో ఎంత మాస్‌, యాక్షన్‌, ఫన్‌ ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇది అసలు సిసలైన సంక్రాంతి సినిమా. కథ చాలా ఆసక్తికరంగా వుంటు-ంది. నిర్మాత నిరంజన్‌ గారు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. అని చెప్పారు. ఈ చిత్రంలో వినయ్‌ రాయ్‌ విలన్‌గా కనిపించనుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement