Thursday, May 16, 2024

హృతిక్ ‘ఫైటర్’పై లేటెస్ట్ అప్డేట్.. టీజర్ రిలజ్ అప్పడే

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘‘ఫైటర్‌’’. బ్యాంగ్ బ్యాంగ్, వార్ తర్వాత, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ – హృతిక్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఇక ఈ మూవీలో దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఈ మూవీ టీజర్‌‌ని ఈ నెల 7న మేకర్స్ రిలీజ్ చేయనున్నట్టు తెతుస్తొంది.

అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ ఇందులో ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫైటర్ మూవీ జనవరి 25, థియేటర్లలో విడుదలయ్యేందుకు రెడీగా ఉంది. ఇక వయాకామ్ 18 స్టూడియోస్, మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించిన ఈ మూవీకి విశాల్ – శేఖర్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement