Tuesday, April 30, 2024

కోన‌సీమ థ‌గ్స్ నుంచి ఫ‌స్ట్ సింగిల్

డాన్స్‌ మాస్టర్‌ బృందా గోపాల్‌ దర్శక త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్స్‌’, తెలుగులో ‘కోనసీమ థగ్స్‌’ పేరుతో విడుదల అవుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత, పంపి ణీదారు శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హె చ్‌ నిర్మిస్తున్నారు. తమీన్స్‌ కుమారుడు హ్రిదు హ రూన్‌ హీరోగా పరిచ యం అవుతుండగా సిం హ, ఆర్‌ కె సురేష్‌, ముని ష్కంత్‌, శరత్‌ అప్పనీ, అనస్వర రాజన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నా రు.’థగ్స్‌’ చిత్రానికి సం బంధించి విడుదల చేసిన పాత్రల పరిచయం వీడి యో, -టైలర్‌ లు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని చిత్రం పై అంచనాలు పెంచాయి. కోనసీమ నేపథ్యంలో జరిగే ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలి గించేలా తెరకెక్కించారు దర్శకురాలు బృంద.

ఈ చిత్రానికి సంభందించిన మొదటి వీడియో పాటను చిత్ర బృందం విడుదల చేసింది. అమ్మవారు కాళికా రూపంలో ఊరేగింపుగా వచ్చే సన్నివేశం బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ పాటను చిత్రీకరించారు. ”వీర శూర మహంకాళి వస్తోందయ్యా… వేటా డను ఆ తల్లే వస్తొందయ్యా… ” అంటూ సాగే ఈ పాట చిత్రంలో కీలక సన్నివేశంలో రానుంది. అమ్మవారు పూనినట్లు-గా హృదు చేసిన నృత్యం, డాన్స్‌ కొరియోగ్రఫీ ఆకట్టు-కుంటాయి. శామ్‌ సి ఎస్‌ అమ్మ ఉగ్ర రూపాన్ని ఎలివేట్‌ చేసే ఎనర్జిటిక్‌ ట్యూన్‌ ఇవ్వగా వనమాలి చెడును అంతమొందించే క్రోధాన్ని తెలిసేలా సాహిత్యం అందిం చారు. థగ్స్‌ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషలలో ఫిబ్రవరిలోనే , విడుదలకు సిద్దం అవుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement