Monday, July 1, 2024

Kalki | ‘థీమ్ ఆఫ్ కల్కి’ సాంగ్‌ రిలీజ్…

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మైథాలజక‌ల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏ.డి. ఈ సినిమాలో యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ నెల 27న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుండగా… మేకర్స్ వరుసగా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో సినిమాపై హైప్ పెంచేస్తున్నారు.

YouTube video

ఈ సందర్భంగా తాజాగా కల్కి థీమ్ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇప్పటికే అన్ని చోట్లా భారీ ఎత్తున బుకింగ్స్ జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement