Thursday, October 10, 2024

Janhvi: జాన్వీ క‌పూర్ కి త్వ‌ర‌లో పెళ్లంట‌…

శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ ని తెర‌పై చూసుకుని ఆనందించాల‌ని తెలుగు అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ కోరిక ఎన్టీఆర్ దేవ‌ర`తో తీర‌నుంది. జాన్వీ కపూర్ `దేవర చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో గ్లామ‌ర‌స్ లుక్ తో పాటు త‌న‌దైన‌ న‌ట‌న‌తోను మెరిపిస్తుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే జాన్వీ డైహార్డ్ ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేని ఒక విష‌యం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది.జాన్వీ కపూర్ కి స్కూల్ కాలేజ్ డేస్ నుంచి మంచి స్నేహాలు ఉన్నాయి. అందులో ఒక స్నేహితుడు శిఖ‌ర ప‌హారియాతో జాన్వీ డేటింగ్ చేస్తోంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం ఉంది. ఇక ప‌హారియా కుటుంబంతో బోనీ కుటుంబానికి చాలా కాలంగా స‌త్సంబంధాలున్నాయి. ఇటీవలి ఊహాగానాల ప్ర‌కారం.. శిఖర్ పహారియాను జాన్వీ త్వరలో పెళ్లి చేసుకోబోతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇరు కుటుంబాలు వారి వివాహానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని స‌మాచారం .. వ‌చ్చే ఏడాది ఈ వివాహం చేయాల‌ని బోనీ క‌పూర్ ఆలోచిస్తున్న‌ట్లు బాలీవుడ్ టాక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement