Friday, May 3, 2024

హ‌నుమాన్ జ‌యంతి.. ఆదిపురుష్ నుండి హ‌నుమాన్ పోస్ట‌ర్

హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా ఆదిపురుష్ చిత్రం నుండి హ‌నుమాన్ స్పెష‌ల్ లుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో వెనుక రాముడు ఫేస్ ఉండి ముందు హనుమంతుడు ధ్యానం చేసుకుంటున్నారు. హనుమంతుడి పోస్టర్ ని షేర్ చేసి.. రాముడికి భక్తుడు, రామ కథకి ప్రాణం, జై పవన పుత్ర హనుమాన్ అని పోస్ట్ చేశారు. ఈ సినిమాలో హనుమంతుడిగా దేవ్‌దత్త నగే నటించాడు. దీంతో పాటే ఆదిపురుష్ సినిమా 16 జూన్ 2023 రిలీజ్ అవుతుందని మరోసారి కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. కృతిసనన్ సీత పాత్రలో.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్న ఈసినిమాను దాదాపుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రాధేశ్యామ్ తరువాత సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ ను చూడలేదు ప్యాన్స్. దాంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement