Friday, May 3, 2024

ఇవానా హీరోయిన్ గా సెల్ఫిష్

ఇప్ప‌టివ‌ర‌కు త‌మిళ చిత్రాల్లో నటించిన ఇవాన డైరెక్ట్ తెలుగు చిత్రంలో న‌టించ‌నుంది.ఆ చిత్ర‌మే సెల్ఫిష్.హైదరాబాద్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాను, నిర్మాత దిల్ రాజు – సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు. విశాల్ కాశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కాగా ఇవాన లవ్ టుడే లో హీరోయిన్ గా చేసింది. దాంతో ఆమెకి పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడిపోయారు. విశాలమైన కళ్లతో ఇవాన చేసిన విన్యాసాలకు కుర్రాళ్లు మనసులు పారేసుకున్నారు. ఆ తరువాత ఆమె వరుసగా తమిళ సినిమాలతోనే బిజీ అయింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా ఆమె ఒక తెలుగు సినిమా చేస్తోంది .. ఆ సినిమా పేరే ‘సెల్ఫిష్’. ఈ సినిమాలో ఆమె ఆశిష్ జోడీగా ‘చైత్ర’ పాత్రలో అలరించనుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement