Sunday, May 5, 2024

Nitin | ఆకట్టుకుంటున్న ‘‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’’ ట్రైలర్

వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెర‌కెక్కుతున్న మూవీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక‌ ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ రిలీజ్ అవ్వగా.. తాజగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

YouTube video

ట్రైలర్ చూస్తుంటే మూవీ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని అర్ధమవుతుంది. ఈ మూవీలో నితిన్ సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నారు. ట్రైలర్ మొత్తం తన కామెడీ టైమింగ్ తో అలరించాడు నితిన్. ఇక నితిన్ తండ్రి పాత్రలో రావు రమేష్ కూడా కామెడీ పండించాడు. ట్రైలర్ చివర్లో రాజశేఖర్ స్పెషల్ అప్పియరెన్స్ ఆకట్టుకుంది.నాకు జీవితం, జీవిత రెండు ఒకటేలే అని చెప్పే డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక, ఈ సినిమాకి హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ అందించ‌గా.. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మించారు. ఈ ఎక్ట్స్రా ఆర్డినరీ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement