Friday, May 3, 2024

స‌లార్ కోసం 5రోజులే షూట్ చేశా.. జ‌గ‌ప‌తిబాబు

స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టిస్తోన్న చిత్రాల్లో స‌లార్ ఒక‌టి. కాగా ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ప‌వ‌ర్ ఫుల్ రోల్ లో న‌టిస్తున్నార‌ట‌..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుందా? ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇందులో జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తాను కేవలం ఐదు రోజుల షెడ్యూల్ లో మాత్రమే పాల్గొన్నానని చెప్పారు. ఆ ఐదు రోజులు ఒకే ఒక్క సన్నివేశం చిత్రీకరించారని అన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అసాధారణమైన టాలెంట్ కలిగిన వ్యక్తి అని.. అందుకే తాను సలార్ సినిమా స్టోరీ గురించి.. తన క్యారెక్టర్ గురించి ఎక్కువగా అడగలేదని.. ఇలాంటి టీంతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.జ‌గ‌ప‌తిబాబు చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement