Saturday, July 27, 2024

బిజీగా శ్రీలీలా – బ‌ర్త్ డే సంద‌ర్భంగా ధ‌మాకా పోస్ట‌ర్ రిలీజ్

పెళ్లి సంద‌D చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది హీరోయిన్ శ్రీలీలా. ఈ చిన్న‌దాని చేతిలో ప్ర‌స్తుతం మూడు, నాలుగు సినిమాల‌న్నాయి. అందులో ‘ధ‌మాకా’ ఒక‌టి. మాస్‌రాజ ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి త్రినాధ్ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా మేకర్స్ శ్రీలీలా పోస్టర్‌ను విడుద‌ల చేస్తూ బ‌ర్త్‌డే విషెస్‌ను వెల్ల‌డించారు. బెంచ్‌పై కూర్చొని చేయిపై త‌ల‌ను వాల్చి దీనంగా చూస్తున్న‌ట్లు పోస్ట‌ర్‌లో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ల‌పై అభిషేక్ అగర్వాల్‌, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు శ్రీలీలా కిరీటీ డెబ్యూ మూవీలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. నితిన్-వ‌క్కంతం వంశీ సినిమాలో న‌టిస్తుంది. బాల‌కృష్ణ‌-అనీల్ రావిపూడి చిత్రంలో బాల‌కృష్ణ కూతురు పాత్ర‌లో న‌టిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement