Wednesday, May 1, 2024

నీ పెళ్ళాన్ని అడిగి ఆనందించు… పాయల్ ఘాటు రిప్లయ్

ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అంతేకాకుండా పాయల్ కు మంచి క్రేజ్ ని కూడా తెచ్చి పెట్టింది. అయితే పాయల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ రకరకాల పోస్టులను కొత్త కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా టోపీతో షేర్ చేసిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది.

ఆ ఫొటోలో టాప్ లెస్ తో ఎద భాగం కనిపించకుండా టోపీని కవర్ చేస్తూ కనిపిస్తుంది. అయితే ఈ ఫోటో పై నెటిజెన్ ఓ కామెంట్ చేశాడు. నీ టోపీ వెనుక ఏం ఉందో చూడాలని ఉంది… అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్ కు పాయల్ రిప్లై ఇచ్చింది. నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది. నీకు ఈ వయసులో ఇలాంటివి కావాలా… అయితే వెళ్లి నీ పెళ్ళాన్ని అడిగి ఆ ఆనందాలను అనుభవించు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement